
కొత్తగా తల్లైనవారు తరచు బిడ్డల బట్టల విషయంలో అయోమయపడతారు. మీ బిడ్డ కోసం ముచ్చటైన దుస్తులు చాలా ఉంటాయి! అయితే, చిన్నపిల్లలకు సౌకర్యవంతంగాను, సురక్షితంగాను, అందంగాను ఉండేలా బేబీ దుస్తులను ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని కీలక అంశాలను గుర్తుంచుకోవడం చాలా అవసరం. ఏమేమి పరిగణలోకి తీసుకోవాలో తెలుసుకోవడమనేది సరైన దుస్తులను ఎంపిక చేయడానికి సహాయపడుతుంది.
కొత్తగా పుట్టిన పిల్లల దుస్తులు వారి సున్నితమైన చర్మంపై మృదువుగా ఉండేలా, గాలి ఆడే ఆస్కారం ఉండేలా తయారై ఉండాలి. కుట్ల దగ్గర గరుకుగా ఉండకుండా, గుచ్చుకొనేలాంటి లేబుల్స్ లేకుండా చూసుకోవాలి. శిశువు కదలటానికి సౌకర్యంగా ఉండేలా, సాగే అవకాశం ఉన్న బట్టతో చేసిన దుస్తులను ఎంచుకోవాలి. కొత్తగా పుట్టిన బిడ్డకు దద్దుర్లు, అసౌకర్యం కలగకుండా చర్మానికి గాలి ఆడేలా ఉండాలి. బిడ్డలకు బాగా బిగుతుగా, ఇరుకుగా ఉన్న దుస్తులు వేయటం మానాలి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: పసి పిల్లల బట్టలు గాలిలో ఆరబెట్టడం ఎంత వరకు సురక్షితం?
మగపిల్లల బట్టలు గానీ ఆడపిల్లల బట్టలు గానీ ఎంచుకునేటప్పుడు, చిన్నచిన్న గుండీలు, కుందన్లు, చమ్కీల లాంటి ఇతర అలంకార వస్తువులు లేని దుస్తులను ఎల్లప్పుడూ ఎంపిక చేసుకోండి. అవి ఊడిపోతే, పొరపాటున నోటిలోకో, ముక్కులోకో వెళ్తే, ఊపిరికి అడ్డం పడి ప్రమాదం అవుతుంది. పొడవాటి తాళ్ళు, తీగలు ఉన్న దుస్తులను నివారించండి, ఎందుకంటే పిల్లలు వాటితో ఆడుకోవాలనే ఆసక్తితో ప్రమాదాలు కొనితెచ్చుకోవచ్చు. కొన్నిసార్లు, వాటిలో పిల్లల చేతి వేళ్లో, కాలి వేళ్లో చిక్కుకుపోవచ్చు. కాబట్టి సురక్షితంగా ఉండటం కోసం పొడవాటి తాళ్లు లేని దుస్తులను ఎంచుకోవడం మంచిది.
3. ప్రస్తుత కాలాన్ని పరిగణించండి (Consider the season)
ప్రస్తుత సీజన్‌కు తగిన దుస్తులను ఎంచుకోవడం చాలా అవసరం. పిల్లలు త్వరగా జలుబు బారిన పడతారు. కాబట్టి శీతాకాలంలో, కొత్తగా పుట్టిన పిల్లల తల్లులు వెచ్చగా హాయిగా ఉండే శీతాకాలపు బేబీ దుస్తులను దగ్గరుంచుకోవాలి. వేసవి నెలల్లో అయితే, చిన్నారులను చల్లగాను, సౌకర్యంగాను ఉంచడానికి తేలికపాటిగా, గాలి ఆడేందుకు అనువైనట్టుగా ఉన్న బట్టతో తయారు చేసిన పిల్లల దుస్తులను ఎంచుకోండి.
శిశువుల దుస్తులను ఎంచుకునేటప్పుడు, వాటిని జాగ్రత్త చేసుకోవడం సులభమా కాదా అని ఎల్లప్పుడూ ఆలోచించండి. కొత్తగా పుట్టిన పిల్లలకు తరచు బట్టలు మారుస్తూ ఉండాలి. కాబట్టి సులభంగా ఉతికి ఆరబెట్టే బట్టలు ఎంచుకోవడం అవసరం. శుభకార్యాలకు, పండుగలకు వేసే దుస్తులను వెతుకుతున్నప్పుడు, సులభంగా చేతితో ఉతకటానికి, లేదా డ్రై క్లీన్ చేయటానికి అనువైన స్టైల్‌ను ఎంచుకొనేలా చూసుకోండి.
చంటితనంలో అందమైన ఫోటోలు తీయటం కోసం, కొత్తగా పుట్టిన పిల్లలను కుచ్చుకుచ్చుల దుస్తులలోను, మెరిసే దుస్తులలోను అందంగా తయారుచేయాలని తల్లులు ఆరాటపడవచ్చు. అయినప్పటికీ, కొత్తగా పుట్టిన పిల్లలు నుంచోవటం, అటూ ఇటూ నడవటం చేయలేరు కనుక వారు తమ దుస్తులను ఎలాగూ అందంగా నలుగురికీ చూపించుకోలేరు. పైగా, ఫాన్సీగా ఉండే దుస్తులు శిశువులకు అసౌకర్యంగా కూడా ఉంటాయి, కాబట్టి పిల్లలు కొంచెం పెద్దయ్యేవరకు ఇలాంటి దుస్తులను ఆపటం ఉత్తమం. అప్పుడైతే పిల్లలు కూడా ఇలాంటివి వేసుకొని మురిసిపోతారు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: చలికాలం ముందు లేదా చలికాలంలో పిల్లలకు ఉన్ని బట్టలు కొనడానికి సరైన సమయం
కొత్తగా పిల్లలను కన్న తల్లులు తరచుగా తమ బిడ్డలకు ఏ సైజ్ దుస్తులు కొనుగోలు చేయాలో తెలియక గందరగోళాన్ని ఎదుర్కొంటారు. దీన్ని ఎదుర్కోవడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, కొంచెం సాగే అవకాశమున్న వదులు దుస్తులను కొనటం. దీనివల్ల శిశువు ఎదుగుదలకి అవకాశం ఉంటుంది, అలాగే ఆ ఎదుగుదలని బట్టి మళ్లీ మళ్లీ కొన్ని వారాలకొకసారి కొత్తగా బట్టలు కొనాల్సిన అవసరం లేకుండా ఉంటుంది!
మెషిన్‌లో ఉతకదగిన దుస్తులను ఎంచుకోవడం ద్వారా తల్లి పని సులభం అవుతుంది. కొత్తగా పుట్టే బిడ్డలు తరచుగా చొంగ కార్చుకుంటారు, కక్కుకుంటారు, ప్రమాదాలకు గురవుతారు, కాబట్టి వాషింగ్ మెషిన్‌లో ఉతకగలిగే దుస్తులను ఎంచుకోవడం చాలా అవసరం. అంతే కాక, మెషిన్‌లో ఉతకగల బట్టలే చేతితో సున్నితంగా ఉతకవలసిన బట్టలకంటే చవకగా దొరుకుతాయి కూడా. మెషిన్ వాష్ చేయగల బట్టలను ఎంచుకోవడం వల్ల దీర్ఘకాలంలో సమయం, డబ్బు కూడా ఆదా అవుతాయి.
మీకు ఇది కూడా నచ్చుతుంది: బేబీ బట్టలు ఉతికేటప్పుడు మీరు తప్పక పాటించాల్సినవి & చేయకూడనివి
పిల్లల దుస్తులను కొనటం అనేది చాలా సరదా పని. హాయిగా సమయం గడపటానికి ఇదొక గొప్ప అవకాశం! ఈరోజుల్లో ఆన్‌లైన్‌లో కూడా ముచ్చటగొలిపే పిల్లల బట్టలు ఎన్నో ఉంటున్నాయి. బుజ్జాయిల కోసం షాపింగ్ చేయటాన్ని ఆస్వాదించండి. కొత్తకొత్త రకాలతో ప్రయోగాలు చేయండి. ఆన్‌లైన్‌లో పిల్లల దుస్తులు కొనటం వల్ల మామూలు దుకాణాల్లో దొరకటానికి అవకాశం తక్కువ ఉన్న బట్టలను కూడా కొనుక్కోవచ్చు.
మీరు పిల్లల దుస్తులపై మంచి డీల్స్ కోసం చూస్తున్నట్లయితే, ఆన్‌లైన్ రిటైలర్‌లపై ఎప్పుడూ ముందుగానే ఒక కన్ను వేసి ఉంచండి. బయటి దుకాణాలతో పోల్చితే సాధారణంగా ఆన్‌లైన్ స్టోర్‌లలో పిల్ల దుస్తులపై తగ్గింపు ధరలు ఉంటూ ఉంటాయి. అంతే కాక, ఆన్‌లైన్ రిటైలర్‌ల వద్ద సాధారణంగా ఎక్కువ రకాల సైజులు, స్టైల్స్, బ్రాండ్‌లు ఉంటాయి. కాబట్టి, మీరు డబ్బును ఆదా చేసుకోవాలనుకుంటే, ఎంపిక చేసుకోవటానికి ఎక్కువ రకాలు కావాలనుకుంటే, ఎల్లప్పుడూ ఆన్‌లైన్‌లో కొత్తగా పుట్టిన పిల్లల దుస్తుల కోసం వెతకటం మొదలుపెట్టండి.
కొత్తగా పుట్టిన బిడ్డల తల్లులు సౌకర్యవంతమైన బేబీ దుస్తులను ఎంచుకునేటప్పుడు చాలా ఆలోచించవలసి ఉంటుంది, పైన పేర్కొన్న సాధారణ చిట్కాలను అనుసరించడంతో ఆ పని కొంచెం సులభతరం కావటంలో సహాయం అవుతుంది. చివరిగా, శిశువుకు సౌకర్యవంతమైన, సురక్షితమైన, ఆచరణాత్మక దుస్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. కొంచెం ప్రణాళికతో, పరిశోధనతో, ఏ కొత్త తల్లి అయినా తమ చిన్నారి కోసం సరైన వార్డ్‌రోబ్‌ను సులభంగా ఎంచుకోవచ్చు.
Baby clothes shopping in telugu, tips for baby shopping in telugu, Shopping for baby clothes in telugu, Points To Remember While Selecting Baby Clothes in English, Points To Remember While Selecting Baby Clothes in Hindi, Points To Remember While Selecting Baby Clothes in Tamil, Points To Remember While Selecting Baby Clothes in Bengali.
This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |